యూరియా యాప్ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ పట్టణ బంద్ విజయవంతమైం

‘కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని సేకరించాలని, సంక్రాంతి లోగా యాసంగి పంటలకు రైతు భరోసా విడుదల చేయాలని, యూరియా యాప్ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ పట్టణ బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు వ్యాపారులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బస్ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు.
