
జనవరి 7 (శ్రీరామ్ చక్రి న్యూస్):
ABVP 44వ రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అలివేలి రాజును మరోసారి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీగా నియమించారు.
ఈ సందర్భంగా అలివేలి రాజు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, విద్యారంగ సమస్యలపై ABVP ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టి విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు.
స్టేట్ జాయింట్ సెక్రటరీగా మరోసారి అవకాశం కల్పించిన ABVP రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
