గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది.

గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించడంతో అందరి దృష్టి మున్సిపాలిటీలపై పడింది. ఎన్నికల కమిషన్ జనవరి 10 నాటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తుది ఓటరు జాబితాలను సిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. గురువారం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేశారు. గత సంవత్సరం అక్టోబరు 1 నాటి డేటా ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించారు.
