రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వా మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

బీబీనగర్, జనవరి 02 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వా మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గ్రేడ్–వన్ దేవాలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం రెండేళ్లుగా అభివృద్ధి లేక పూర్తిగా కుంటుపడిందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా భక్తులకు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో కోతుల బెడద అధికమై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
