భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్ తెలిపారు.

అందుకోసం తనకు రానున్న గౌరవ వేతనాన్ని గ్రామాభివృద్ధికి కేటాయిస్తానని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్కు మండల రజిత మహేందర్ వినతి పత్రాన్ని అందజేశారు.
