మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటిని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటి ని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. భగీరత్పుర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 25 నుంచి 30 మధ్య ఈ మరణాలు నమోదయ్యాయి. డిసెంబర్ 25న మున్సిపల్ అధికారులు సరఫరా చేసిన కొళాయి నీటిలో ఓ విధమైన వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ నీటిని తాగి పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఆ కాలనీకి చేరుకొని నీటిని పరిశీలించారు.
