యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని అన్వేష్‌పై ఫిర్యాదులు అందడంతో రెండు కేసులు నమోదు చేశారు.

దేవీ దేవతలను యూట్యూబర్ అన్వేష్ దూషించాడని సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణి ఫిర్యాదుపై బీఎన్ఎస్ 352, 73, 299, ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై త్వరలోనే అన్వేష్‌కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
