రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పరిధిలో జింక మాంసం విక్రయాలు కలకలం రేపాయి.

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పరిధిలో జింక మాంసం విక్రయాలు కలకలం రేపాయి. అత్తాపూర్లోని సులేమాన్ నగర్ ప్రాంతంలో జింక మాంసాన్ని అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పక్కాగా సమాచారం రావడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నిందితుడి దగ్గరి నుంచి భారీగా జింక మాంసం, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు
