సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఆయన వివరించారు.

దుర్గమ్మ వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువదీరిన దుర్గమ్మ వారిని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రసాదంతోపాటు చిత్ర పటాన్ని ఆయనకు ఆలయ అధికారులు అందజేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆయన్ని ఆశీర్వదించారు.
