ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అల్మోర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది .

భికియాసేన్ నుంచి అల్మోరా జిల్లాలోని రామ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
