అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైక్ పడటంతో ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
