మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పోలీస్, అటవీశాఖ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

నర్సాపూర్‌లో సాండ్ బజార్‌ను ప్రారంభించామని, త్వరలో మెదక్‌లో ప్రా రంభిస్తామని తెలిపారు.సంబంధింత ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఒక ఫార్మాట్ అందిస్తారని, ఇసుక అవసరాలను అందులో పొందుపర్చి అందజేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ ంగా మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తెలియజేయాలని సూచించారు. చట్టాలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే ప్రాంతాల్లో సీసీకెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతామన్నారు.
