జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీస్తున్నా 252 జీవోను సవరించాలని టిడబ్ల్యూజేఎఫ్ అకాడమీ కమిటీ కన్వీనర్ రామచందర్ డిమాండ్ చేశారు.

కొల్లాపూర్ : జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీస్తున్నా 252 జీవోను సవరించాలని టిడబ్ల్యూజేఎఫ్ అకాడమీ కమిటీ కన్వీనర్ రామచందర్ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్ మండలం కృష్ణానది తీరంలోని సోమశిలలోని సోమశిల ఐలాండ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మూడవ మహాసభలకు రాష్ట్ర నాయకులు ఎస్కే సలీమా, రఘు, కృష్ణయ్యలతో కలసి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అంటూ వేరు చేసే పరిస్థితులను తీసుకొచ్చిందన్నారు. 252 జీవో ద్వారా మీడియా కార్డు, అక్రిడేషన్ కార్డులను తెచ్చిందన్నారు.
