వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం డిమాండ్ చేశారు.

కాజీపేట : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం డిమాండ్ చేశారు. కాజీపేట పట్టణం 61 వ డివిజన్ పరిధిలోని ఫాతిమా నగర్ సమీపంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం స్థలాన్ని పలువురు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం కుడి చేయిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్యసం చేశారన్నారు. గతంలో కూడా సిమెంట్ గద్దెను తవ్వడం, ఐలమ్మ విగ్రహాన్ని దొంగలించారని తెలిపారు.
