
డిసెంబర్ 27( శ్రీరామ్ చక్రి న్యూస్) మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విజయ్ కుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవోపేతంగా ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ గురుస్వామి మాట్లాడుతూ, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న కన్య సాములు, గురుస్వాములు, కత్తి సాములు సహా అయ్యప్ప స్వాములందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు మంత్రోచ్ఛారణలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలతో భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేశాయని అన్నారు.
అనంతరం స్వామివారి మహా పడిపూజను అత్యంత శాస్త్రోక్తంగా, భక్తి భావంతో నిర్వహించి ఈ మహోత్సవాన్ని ఘనవిజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మహా పూజా మహోత్సవం భక్తుల్లో అయ్యప్ప స్వామి భక్తిని మరింత బలపరిచిందని కుమార్ గురుస్వామి తెలియజేశారు
