
డిసెంబర్ 25, శ్రీరామ్ చక్రి న్యూస్ ఇండియన్ స్కూల్, జిలెల్లగూడలో అంతర్జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల వైస్ చైర్మన్ భవాని దత్త, చైర్మన్ నరేన్ దత్త ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని మేధస్సును పదును పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పైథాగరస్ సిద్ధాంతం, త్రికోణమితి త్రీడీ కోణాలు, బీజగణిత నమూనాలు రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ వేషధారణల్లో అలరించగా, వివిధ గణిత చిహ్నాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.అదేవిధంగా పాఠశాల నిర్వహించే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
