పునర్విభజన రగడ మరింత ముదురుతున్నది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా.. ఏకపక్షంగా తోచినట్లు డివిజన్లను సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

భౌగోళిక సమతుల్యత, సాంకేతిక అధ్యయనాలు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి.. కేవలం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రక్రియ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు సమయం ఇవ్వగా, పునర్విభజన లోపాలను ఎత్తిచూపుతూ.. ఇప్పటికే 1500లకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. కాగా, సోమవారం తలసాని నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం బల్దియా కమిషనర్‌ను కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది
