కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని.. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సర్పంచులకు నిధులు ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలు కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు.

KTR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని.. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సర్పంచులకు నిధులు ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలు కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు? అవి వాళ్ళ ఇంటి సొత్తు కాదు.. వాళ్ళు ఏమన్నా సొంత ఆస్తులు అమ్మి కడుతున్నారా అని ప్రశ్నించారు.
