మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో బాబాయ్ బీఆర్ఎస్ నాయకుడు, అబ్బాయ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామానికి జనరల్ రిజర్వేషన్ కేటాయించారు. దీంతో గ్రామంలో ఉండే రెడ్డి వర్గంతోపాటు గ్రామపెద్దలు అంతా కలిసి వారి ఇద్దరిని కూర్చోబెట్టి సర్పంచ్‌గా ఏకగీవ్రం చేయాలనే సంకల్పంతో చర్చలు జరిపారు. అందులో బాబాయ్ ఆకులమోని రవి మంచితనంతోపాటు గతంలో పోటీ చేసి ఓడిపోయినందుకు అతనినే సర్పంచ్‌గా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. అందుకు అతను గ్రా మంలోని దేవాలయానికి రూ.8 లక్ష లు ఇస్తానని ఒప్పుకోగా గ్రామస్తులు కూడా అతడినే సర్పంచ్ అని నిర్ణయించారు.
