గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పోలింగ్ ఎధావిధిగా జరగనుండగా కౌంటింగ్ మాత్రం నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మల్కెపల్లి షెడ్యూల్ ఏరియాపై పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించగా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. రెవెన్యూ రికార్డు విరుద్ధంగా నాన్ షెడ్యూల్ ఏరియాగా ఉన్న మల్కెపల్లి గ్రామాన్ని అధికారులు షెడ్యూల్ ఏరియాగా కొనసాగిండం అన్యాయమని, దీనిపై చర్యలు తీసుకొని మల్కెపల్లి గ్రామ పంచాయతీని నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలని కోరుతూ గ్రామానికి చెందిన కసాడి శ్రీనివాస్, పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించారు.
