నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన సర్పంచ్ గోడం నందినీ అమృత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.

నేరడిగొండలోని తన నివాసంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ గంగాధర్, వార్డు సభ్యులు మహేందర్, నారాయణ, రజిత, నైతం లక్ష్మి, గూళ్లే లక్ష్మి, విజయలక్ష్మి, విజేశ్ను ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం వారిని శాలువా కప్పి సన్మానించారు. తమ గ్రామ అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే అనిల్‌తోనే సాధ్యమని పార్టీలో చేరినట్లు సర్పంచ్ నందినీ అమృత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ భీముడు, యువ నాయకులు రాథోడ్ సురేందర్, ఖయ్యూం, గ్రామస్తులు పాల్గొన్నారు.
