
ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులు. ఇదే ప్రాంతంలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మరియు మా నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఉన్నత విద్య అవకాశాలు కల్పించాం

మహేశ్వరం, మీర్పేట్:
మహేశ్వరం నియోజకవర్గంలోని మీరపేట్ మున్సిపల్ కార్పొరేషన్–జిహెచ్ఎంసి పరిధిలోని చెల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ATA) సామాజిక కార్యక్రమాల భాగంగా పేద మరియు అర్హత ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.ముఖ్య అతిథులు:మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ,ATA అధ్యక్షులు చల్ల జయంత్
TUF IDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి కృషిని ATA సభ్యులు ప్రశంసించారు
చెల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సబితా ఇంద్రారెడ్డి గారి కృషి ప్రశంసనీయం అని ATA సభ్యులు పేర్కొన్నారు. అర్హత ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు.పాఠశాల సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని ATA హామీ పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ATA ప్రతినిధులు, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థులు అదృష్టవంతులు” – ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్నారు:ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులు. ఇదే ప్రాంతంలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మరియు మా నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఉన్నత విద్య అవకాశాలు కల్పించాం. మీరు బాగా చదివి మన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నించండి. మనం అమెరికాకు వెళ్లడం కాదు; అమెరికాలో ఉన్నవారిని పోలి మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలి.”
పాల్గొన్నవారు:ATA సభ్యులు, స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు.
