కాంగ్రెస్ రెండేళ్ల పాలనై మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లకు సీఎం రేవంత్ ప్రజలకు వేదన, రోదన మిగిల్చారని విమర్శించారు.

హైదరాబాద్, డిసెంబర్ 8: రెండేళ్ళ కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజా దర్బార్‌లో ప్రజలను కలుస్తా అన్నారని.. ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్సాలకు, విందులకు పెళ్లిళ్లకు, సీఎల్పీ మీటింగ్‌లకు ప్రజా భవన్‌ను వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు.
