జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్‌గా మారుతున్నది. శానిటేషన్, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తిపన్ను లెక్కింపుపై గందరగోళం నెలకొంది.

రంగారెడ్డి; విలీనమైన 27 పురపాలికల పరిధిలోని ప్రాపర్టీల వివరాలను సీజీజీ (సెంట్రల్ గుడ్ గవర్నెన్స్) ద్వారా జీహెచ్ఎంసీ రికార్డుల్లోకి బదలాయించారు. ఈ నేపథ్యంలోనే ఆస్తిపన్ను లెక్కింపుపై అధికారులు స్పష్టత రాకపోవడంతో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్తిపన్ను లెక్కింపులో రెండు విధానాలు ఉండడమే ఇందుకు కారణమైంది.
