సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ అండంతో మైనింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పటాన్చెరు, డిసెంబర్ 7: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ అండంతో మైనింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రుద్రారం, లక్డారం శివారుల్లోని మైనింగ్ గనుల వద్ద అక్రమంగా బ్లాస్టింగ్లు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనుల్లో 6 మీటర్ల నుంచి 10 మీటర్లలోపు తవ్వకాలు చేయాలి. కానీ, వ్యాపారులు అక్రమంగా 50 అడుగుల వరకు తవ్వకాలు చేపడుతున్నారు. లీజ్ ఏరియా బయట కంకర కోసం తవ్వకాలు చేసినట్లు గతంలో అధికారులు గుర్తించినా చర్యలు తీసుకోలేదు. గనుల్లో బ్లాస్టింగ్ చేసేందుకు పేలుడు పదార్థాల లైసెన్స్లు తీసుకోవాలి
