ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. కాస్తాకూస్తో చేతికొచ్చిన ధాన్యపు గింజలనైనా అమ్ముకుందామంటే ఎక్కడ చూసినా దళారులే రాజ్యమేలుతున్నారు.

తేమశాతం పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పెడుతున్న నిబంధనలు రైతన్నలకు గుదిబండలా మారాయి. దీంతో ఓపిక నశించిన రైతులు.. ప్రైవేటులో విక్రయించుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 105 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించినా.. ఇప్పటివరకు కేవలం 25వేల మెట్రిల్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.
