సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అవి బుగ్గవాగుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి 8,845 క్యూసెక్కులు ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు.

సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలు (ప్రకాశం సరిహద్దు)కు 2,850 క్యూసెక్కుల నీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం 2,179 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉన్నతాధికారులు అందిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాకు ఇంకా 650 క్యూసెక్కులు విడుదల చేయాలి. ఈ నీటి మొత్తాన్ని గుంటూరు జిల్లా రైతులు అదనంగా వాడుకుంటుండటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది.
