రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల గుబులు పట్టుకున్నది.

ఎన్నికల సంఘం సర్పంచ్లకు 30, వార్డు సభ్యులకు 20 రకాల సింబల్స్ ప్రకటించగా.. కొన్ని ఒకే మాదిరిగా ఉండడం వారిలో ఆందోళనను రేకెత్తిస్తున్నది. తమ మద్దతుదారులు, వృద్ధులు ఒక గుర్తనుకొని మరో దానిపై ఓటు వేస్తే తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనన్న బెంగ వారికి పట్టుకున్నది. తమకు కేటాయించిన గుర్తును ఓటర్లు గుర్తుపెట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది
