మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

రిజర్వేషన్లపై బీఆర్ఎస్కు మాట్లాడే నైతికత లేదని ఆక్షేపించారు. ఇవాళ(శనివారం) హనుమకొండలో కిషన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కిషన్రెడ్డి.
