సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర .

ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరుల సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. రెండేండ్లు పూర్తయినా ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాల పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఎనిమిది చెరువులు మంజూరు చేసి, భూసేకరణ సైతం పూర్తి చేసిందన్నారు
