ఆదిలాబాద్డ్లజిల్లాలో బండిపై కేసీఆర్ ఫొటో పెట్టి, డప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కే) గ్రామంలో ఒక్కరోజు ముందుగానే దీక్షా దివస్ వేడుకలు జరుపుకున్నారు. ఎడ్లబండిపై కేసీఆర్ ఫొటో పెట్టి, డప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
దశాబ్దన్నరం క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ముక్రా కే గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరేసుకుందామని అన్నారు. కేసీఆర్ లేకుండా ఇంకా 300 ఏండ్లయినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు.
