జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్పై పోలీసులతో బల ప్రయోగానికి గురి చేసింది. అడుగుడుగునా ప్రచారంలో ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలను సైతం తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేసింది. జూబ్లీహిల్స్ లోని అనేక బస్తీల్లో, గల్లీల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తిష్ట వేసుకుని ఓట్లు వేయించుకున్నారు. ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకం. స్థానికేతరులు పోలింగ్ రోజు ఉండటం తీవ్రమైన నేరం. అయినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరించింది
