:బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్‌పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

బత్తలపల్లి(అనంతపురం): ఆస్పత్రిలో బిడ్డ జన్మించిందని తెలియగానే ఆనందంగా చూడడానికి బయల్దేరిన తండ్రి మార్గమధ్యలోనే దుర్మరణం చెందాడు. బిడ్డను చూడకుండానే కన్నుమూశాడు. మండలకేంద్రంలోని వైజంక్షన్‌లో బుధవారం రాత్రి బైక్ కిందపడి ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ (25) మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం(Dharmavaram)లోని శాంతినగర్‌కు చెందిన నాగేంద్ర కుమారుడు దిలీప్‌కుమార్ పట్టు చీరలకు సంబధించి రేషన్ వ్యాపారం చేస్తుండేవాడు.
