బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ధర్మ పోరాట దీక్షకు మద్దతు

నవంబర్12 : బీసీలు ఏకం కాకుండా వారిలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఆధిపత్య కులాల కుట్రలను ఎండగట్టాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హ నుమకొండలోని కేయూ ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో కేయూ బీసీ జేఏసీ విద్యార్థి చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ధర్మ పోరాట దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. బీసీలను విభజించు-పాలించు అనే పద్ధతిలో అగ్రవర్ణ కులాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు.
