సుమారు నెలరోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని నియోజకవర్గంలో మోహరించాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేదెవరో శుక్రవారం తేలనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. పది రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు.

అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ , ఎలాగైనా జూబ్లీహిల్స్‌పై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాయి. సుమారు నెలరోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని నియోజకవర్గంలో మోహరించాయి
