రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నదని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్వీనర్ ఎస్ ధర్మేంద్ర పిలుపునిచ్చారు.

హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11 : తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 13న ఏకశిలా జయశంకర్ పార్క్ వద్ద జరిగే పెన్షనర్ల మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ర్ట కో-కన్వీనర్ ఎస్ ధర్మేంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
