మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతున్నది.

మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల ఆరబెట్టి కొనుగోలుకు సిద్ధం చేసిన ధాన్యం భారీ వర్షాలకు పూర్తిగా తడిసి మొలకలు వస్తున్నాయి. వరదలో వడ్లు కొట్టుకుపోతున్నాయి. కొందరు రైతులు చేసేదేమీలేక ఆరబెట్టిన ధాన్యాన్ని అలాగే వదిలేసి, దేవుడిపై భారం వేసి కంట తడిపెడుతున్నారు.
