కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు. వీరి కుమారుడు సిరిపురం వంశీ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ ఆ దంపతులు మానవత్వం మరిచిపోలేదు. తమ కన్నీళ్లను దిగమింగుకొని అచేతన స్థితితో ఉన్న మరో నిరుపేద కుటుంబం కన్నీళ్లు తుడిచారు గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు. వీరి కుమారుడు సిరిపురం వంశీ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చేతికంది వచ్చిన చెట్టంత కొడుకు పోయాడన్న బాధలో ఉన్న ల దంపతులు తమ కష్టం మరొకరికి రావొద్దని కోరుకున్నారు.
