వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్అ ధ్యాపకులకు సూచించారు.

శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తగ్గడానికి గల కారణాల పై అధ్యాపకులను నిలదీశారు. కళాశాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున కష్టపడి చదువుకోవాలని , వంద ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
