భారీ వర్షాలతో తుంగభద్రకు జలకళ
- జలాశయానికి భారీగా చేరుతున్న వరద
- 80 టీఎంసీలు దాటడంతో నీటి విడుదల యోచన
- దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పొటెత్తుతోంది. ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది.
తుంగభద్ర డ్యా నీటి నిల్వ సామర్థం 105.788 టీఎంసీలు, అయితే క్రస్ట్ గేట్ల పరిస్థితి నేపథ్యంలో డ్యాంలో నీరు 80 టీఎంసీల మాత్రమే నిల్వ చేయాలని సేఫ్టీ నిపుణుల కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరడంతో నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం బోర్డు అధికారుల నీటి లెక్కల కొలతప్రకారం 21,697 క్యూసెక్కులకు చేరుకుంది.
