వనం శ్రీవర్ష (14) అనే విద్యార్థిని ఎవరు లేని సమయంలో డార్మెంటరీ హాల్లో చున్నీతో ఉరివేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో చోటుచేసుకుంది.

భీమదేవరపల్లి, అక్టోబర్ 24: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం మేరకు.. శ్రీ వర్ష సెలవులకు వెళ్లి గురువారమే పాఠశాలకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం ఉపాధ్యాయురాలి సెల్ నుండి ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసింది. తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండనని మొరపెట్టుకుంది.
