మంత్రాల చెరువులో ఆత్మహత్య, బంధువులకు మృతదేహం అప్పగింపు

బాలాపూర్, అక్టోబర్ 12 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
బడంగ్పేట్లో మిస్సింగ్‌గా నమోదైన మహిళ అనంతరం మృతదేహంగా కనిపించింది. స్థానికంగా అందిన వివరాల ప్రకారం — రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్పేట్ సమతనగర్కు చెందిన మీసాల కమల @ యాదమ్మ (52), బర్త కృష్ణారావు, అక్టోబర్ 12న ఇంటి నుంచి వెళ్ళిన తరువాత తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అదే రోజు జిల్లెలగూడలోని మంత్రాల చెరువులో ఓ మహిళ మృతదేహం లభించింది. విచారణలో అది మీసాల కమలదేనని గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అనంతరం PME అనంతరం బంధువులకు అప్పగించారు.
పూర్తి వివరాల కోసం కేసు దర్యాప్తులో ఉంది.
