గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.

భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా, మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ త్వరలో విచారణ జరుపనున్నది.
