రాచకొండ కమిషనరేట్
మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ప్రధాన రహదారిపై ఉన్న స్వాగత్ గ్రాండ్ బిల్లింగ్ సెల్లార్‌లోని శ్రీ సిరి ఫుట్‌వేర్ దుకాణంలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఫుట్‌వేర్ దుకాణ యజమాని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు ₹25 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు
తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


