మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్గూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ యజ్ఞం, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం బీజేపీ పార్టీ ఇన్చార్జి అందేల శ్రీరాముల యాదవ్, బడంగ్పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సంప్రదాయ వృత్తులను ఆధునిక పరిజ్ఞానంతో సమ్మిళితం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ యోజన అనేక శ్రమజీవులకు ఆశాజ్యోతి గా మారిందని వారు పేర్కొన్నారు.
ఈ ఉత్సవాల్లో విశ్వబ్రాహ్మణ యజ్ఞ కమిటీ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ పవంచ మురళీ చారి, అధ్యక్షుడు పోలోజు పరిపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు మాధోజు తిరుపతి చారి, ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి రఘునందన్ చారి, కోశాధికారి చొల్లేటి గోవర్ధన్ చారి, పసునూరి మల్లేశ్ చారి, ఆర్గనైజర్ వీరాచారి, కే రూపా చారి, రాజేష్ చారి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు


