మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల చెరువు ఘాట్లను దేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగల సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు_* పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,బతుకమ్మ, బోనాల పండుగలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిదని గుర్తుచేశారు,ఒకప్పుడు చెరువులు మురికి కుప్పాలుగా ఉండేవి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ, ఎస్ ఎన్ డి పి నాలాల్ నిర్మించి, పూడికతీతల ద్వారా చెరువులు అతి సుందరంగా తీర్చిదిద్దబడ్డాయని తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో ముదిరాజులు, గంగపుత్రుల జీవనోపాధి కోసం ప్రభుత్వం చెరువుల్లో చేపలు విడిచేవారని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ఒక్క చెరువులో కూడా చేపలు విడలేదని మండిపడ్డారు.ముదిరాజులు, గంగపుత్రుల జీవనోపాధి పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.విజన్ ఉన్న నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతుకమ్మ – బోనాల పండుగల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేవారని సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు తుక్కుగూడ మున్సిపాలిటీ చెందిన నాయకులు పాల్గొన్నారు.




