
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మంగళవారం నాడు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్వయంగా తన నివాసంలో అందజేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ:
ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏ నిష్పత్తి ప్రకారంగా ప్రజలకు అందుతున్నాయో అర్థంకాని ప్రశ్నగా మారింది,” అని వ్యాఖ్యానించింది.
అదే విధంగా, గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని ఎలా నిర్వహించారన్న దానిపై కూడా స్పందించింది:సీఎం కేసీఆర్ నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ సహాయం పూర్తిగా పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పద్ధతి ప్రకారంగా అందించాం. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు,” అని ధ్వజమెత్తింది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లబ్ధిదారులు చెక్కులు అందుకున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
