నవరత్న సంస్థలలో ఒకటై 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మనుగడపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు వ్యవహరించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి శ్రీకారం చుట్టిందని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు

యైటింక్లెయిన్ కాలనీ, డిసెంబర్ 30: సింగరేణి సంస్థ మనుగడను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతున్నదని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. మంగళవారం రామగుండం-2 ఏరియా వకీల్ పల్లి గనిపై జరిగిన గేట్ మీటింగ్లో ప్రధాన కార్యదర్శి సారంగపాణితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
