నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్‌లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పెద్దసంఖ్యలో వెలిసిన ఆక్రమణలను ఆరునెలల కిందట షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది తొలగించిన సంగతి తెలిసిందే

బంజారాహిల్స్, జనవరి 26: నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్‌లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పెద్దసంఖ్యలో వెలిసిన ఆక్రమణలను ఆరునెలల కిందట షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది తొలగించిన సంగతి తెలిసిందే. సుమారు ఎకరం విస్తీర్ణంలో అడుగడుగునా అక్రమ నిర్మాణాలు రావడంతో నందినగర్ బస్‌స్టాప్‌కు ఆర్టీసీ బస్సులు వచ్చేందుకు నిలిచిపోయాయి. దీంతో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనాలతో ఆరునెలల కిందట నందినగర్ గ్రౌండ్స్‌లోని ఆక్రమణలను కూల్చేశారు. కాగా స్థలంలో ఆక్రమణలను తొలగించిన తర్వాత నందినగర్ గ్రౌండ్స్‌లో పశ్చిమం వైపున స్థలాన్ని ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం టీజీఎస్పీడీసీఎల్కు కేటాయించారు.
