కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీవో గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు.

కుభీర్ : కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీవో గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
